అమరావతి రైతులు (Amaravathi Farmers):
స్వార్థ రాజకీయాలతో ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసానికి దృశ్యరూపమే రాజధానిఫైల్స్ చిత్రం అని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు. చేదు నిజాలు, చీకటికోణాల్ని ప్రజలందరికీ చూపించడంలో దర్శక, నిర్మాతలు వందశాతం విజయవంతమయ్యారన్న ప్రత్తిపాటి ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరోసారి చాటిచెప్పిందన్నారు. రాష్ట్ర భవిష్యత్, రాజధాని నిర్మాణం కోసం 3 పంటలు పండే తమ భూముల్ని నిస్వార్థంగా ఇచ్చిన రైతులకి మిగిలిన కన్నీళ్లకు, వారి ఉద్యమస్ఫూర్తికి అద్ధంపట్టిన పలు సన్నివేశాలు తన మనసును కదిలించాయన్నారు. ఎంతసేపు పగప్రతీకారాలు తప్ప అభివృద్ధి, సంక్షేమం, త్యాగాల విలువ తెలియని ఓ పాలకుడు కంటకుడై ప్రజల్ని పట్టిపీడిస్తున్న తరుణంలో ఇలాంటి మేలుకొలుపు చిత్రాలు రావడం ఎంతో అవసరం ప్రత్తిపాటి అన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావంగా గురువారం రైతులు, పార్టీ నాయకులతో కలసి ఆయన చిలకలూరిపేటలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేవలం అహంతో, రాజకీయ దుగ్దతో ప్రపంచస్థాయి నగర నిర్మాణ స్వప్నాల్ని చిదిమేసిన జగన్ లాంటి పాలకులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది అన్నారు. నిండుసభలో అమరావతిని మన స్ఫూర్తిగా స్వాగతిస్తున్నా అని చెప్పి అంతలోనే నాలుక మడతేసి అమరావతి రైతుల్ని రోడ్డున పడేసిన పాపాన్ని జగన్ జన్మజన్మలకు కడుక్కోలేరని చురకలు వేశారు ప్రత్తిపాటి. అయితే మరో రెండు నెలల్లో ఈ గ్రహణం పోయి అమరావతికి మంచిరోజులు వస్తాయని, తరతరాలకు చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ- జనసేన తీసుకుంటాయన్నారు ఆయన. అందుకు తొలిమెట్టుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం వైకాపాకు అడ్రెస్ లేకుండా చేసి తెదేపా-జనసేన కూటమికి క్లీన్‌స్వీప్ విజయాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రత్తిపాటి తెలిపారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.