తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని, బిఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో 8వ రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం అయింది. ముఖ్య అతిధితులుగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, బంగారు శృతి పాల్గొన్నారు. సోమశిల, సింగోటం ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొల్లాపూర్, కోడెర్, పెద్దకొత్తపల్లి మీదుగా విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. విజయ సంకల్ప యాత్ర నరేంద్రమోదీని మూడోవసారి ప్రధాని చేయడం లక్ష్యంగా, పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ విజయం లక్ష్యంగా ముందుకు సాగుతుందని రాజ్యసభ సభ్యుడు బంగారు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ పది సంవత్సరాలలో అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు, సహసాపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తొడు దొంగలు, బీజేపీ ఎప్పటికి బిఆర్ఎస్ తో కలవదు అన్నారు. యూపీఐ కుంభకోణాలకు నిలయం అన్నారు. కూటమికి నాయకుడు లేడు, నీతి నిజాయితి లేదని విమర్శించారు. పల్లెలు, పట్టణాలలో, నగరాలలో విజయ సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కమలం గుర్తుకు ఓటు వేసి నరేంద్రమోదీని ప్రధానిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆ రెండు పార్టీలు తోడు దొంగలే…
90
previous post