జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పవన్ నమ్మంచి మోసం చేశాడని సీరియస్ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ మండిపడ్డారు. రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు… ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందన్నారు.. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నానని… కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరమని తెలుసుకున్నాని తెలిపారు.
మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవని.. పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైందని ముద్రగడ అన్నారు. మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నానని ముద్రగడ తెలిపారు. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు… ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదని ముద్రగడ తన లేఖలో విమర్శించారు.