కర్నూలు(Karnool) న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపనకు సీఎం జగన్…
సీఎం జగన్ ఈ నెల 4వతేదిన కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కర్నూలుకు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారంటూ టీడీపీ(TDP) రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కర్నూలు న్యాయం రాజధానిగా చేసి హైకోర్టు ఏర్పాటు చేస్తానని మాయ మాటలు చెప్పి మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ రాజధాని చేస్తానని చెప్పి ఇపుడు కొత్తగా న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్ కర్నూలు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ రాయలసీమలో పుట్టి రాయలసీమ వాసులనే మోసం చేస్తూ రాయలసీమ ద్రోహిగా మారారని అన్నారు. ఇక పై ప్రజలు సీఎం జగన్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. గతంలో తమ అధినేత చంద్రబాబు మాట ఇచ్చినట్లుగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని, టీడీపీ పార్టీ కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు కట్టుబడిందని ఆయన స్పష్టం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి