తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గం లో తనకున్న కేడర్ అనుచరులతో 2.5 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే చంటిబాబు ఓపినింగ్ చేయించారు. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వైసీపీ ఇంచార్జ్ తోట నరసింహం, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్లెక్సీ లేకుండా చంటిబాబు ప్లెక్సీలతోనే ప్రారంభించడం తో వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం వద్ద ఎమ్మెల్యే చంటిబాబు పక్కనే ఎంపీ వంగా గీత ప్లెక్సీలు ఉన్నా ఆమె హాజరు కాకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు కొన్ని వ్యాఖ్యలు చేసారు. అధికారులు ప్రోటోకాల్ లేకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో ఇంచార్జ్ నరసింహం కలిసి వచ్చిన లేకపోయినా నేను చేపట్టిన అన్ని ఒక్కటిగా ప్రారంభిస్తున్నాను.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జగ్గంపేటలో ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో నాతో, నా కేడర్ తో సమన్వయంతో మాట్లాడితే కలిసి పనిచేస్తాం. వైసీపీ లో నేను ఎమ్మెల్యే గా ఉన్నాను అయినప్పటికీ ఇంచార్జ్ తోట నరసింహం ఇప్పటి వరకు నన్ను కలవనే లేదు. ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అందరిని కలుపుకునేపోతున్నారు. నరసింహం కలుపుకునే ఆలోచనలో లేనట్లున్నారు. నా కూడా తిరుగుతున్న కొందరిని తీసేసి తోట నరసింహం తన అనుచరులకు చిన్న చిన్న పదవులు ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అసహనం కనిపిస్తుంది. నేను పార్టీ కోసం పనిచేస్తాను. నేను పార్టీ మారడం జరగదు. నన్ను పార్టీ నుండి గెంటేస్తే తప్ప ప్రస్తుతం నియోజకవర్గంలో అదే ధోరణి నడుస్తోంది ఇది జగన్ గమనించాలి. నేను నా ఊరు ఇర్రిపాక వదిలి ఎక్కడికి పోను ఉంటే రాజకీయంగా రాజకీయాల్లో ఉంటాను. లేదంటే వ్యవసాయం చేసుకుంటాను. తోట నరసింహం గారు నన్ను కలవడానికి ఇబ్బందిగా ఉంటే వయసులో ఆయన నాకు పెద్దాయన ఆయనను కలిసి మాట్లాడి ముందుకెల్దామంటే నేనే ఆయన ఇంటికెళ్లి కలుస్తాను.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : NTPC: ఎన్టీపీసీ ను నేడు జాతికి అంకితం చేయనున్న మోదీ.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి