షాద్ నగర్ లో ఆలస్యంగా అవినీతి బాగోతం బయటకు వచ్చింది. దేశ రక్షణకు కాపాల ఉండే జవాన్ ఈ ఉదాంతాన్ని వెలుగులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళితే.. విశ్వనాథపూర్ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి అనే సైనికుడు తన పొలం కు సంబంధించిన ror పహానీలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. కొందుర్గు మండల తహసిల్దారు ఆఫీస్ లో ROR పహణిలు కావాలంటే రూ. 40 ముడుపులు కావాలని రికార్డ్ అసిస్టెంట్ బలరాజు డిమాండ్ చేశారు. చేసేది లేక ప్రైవేట్ వ్యక్తుల చేతులు కలిపిన రికార్డు అసిస్టేంట్ రూ. 30 వేల లంచం తీసుకున్నాడు. రెవెన్యూ కార్యాలయంలో ఏ పని కావాలన్నా.. ప్రైవేట్ వ్యక్తలను సంప్రదించాల్సిందే అనే పరిస్థితులు ఉన్నాయి. సైనికుడు రూ. 30 లంచం ఇచ్చి తన పనులు పూర్తి చేసుకొని తిరిగి బార్డర్ కు వెళ్లాడు. కొందుర్గు మండల తహీసిల్దారు ఆఫీస్ లో జరుగుతున్న అవినీతిని వీడియోలో చిత్రికరించిన సైనికుడు బార్డర్ నుంచి స్థానికి మీడియాకు వీడియోను చేరవేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఉన్నతాధికారులు లంచం తీసుకున్న రికార్డు అసిస్టేంట్ పై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
93
previous post