96
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి స్పీడు ఎంతో ఉపయోగపడిందని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ ఉపయోగించాలనుకుంటోంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడును ఏపీలోనూ వాడుకోవాలని చూస్తోంది. తాజాగా.. ఆయనతో ఏపీలో బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ నెల 15న విశాఖపట్నంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది.