గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) :
రెండేళ్ళు కరోనా వచ్చినప్పటికీ జగనన్న చేసిన సంక్షేమ పరిపాలన ఎవ్వరు కుడా చేయలేదు. ఈ ఐదేండ్లు మీ అందరి గడప గడపను సందర్శించి మీ కష్ట సుఖాలను తెలుసుకొన్నా.. రాయచోటి ని జిల్లా కేంద్రంగా తీసుకురావడంతో పాటు అర్హులైన వారందరికి జగనన్న సంక్షేమ ఫలాలను అందించాం.. మీరు ఒక సారి దీవిస్తే దీనికి రెట్టింపుగా అభివృద్ధి చేస్తా.. ఒక రోజు నన్ను మీరు ఆశిర్వదిస్తే మీ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి ఐదేండ్లు మీ కాళ్ళ కింద పని చేస్తానని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గురిగింజ కుంట, సంబేపల్లి గ్రామలల్లో సుమారు కోటి కి పైగా నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ తో పాటు పొన్నెళ్ళ వాండ్ల పల్లే తారు రోడ్డును ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే కి స్థానిక వైకాపా ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు కుటుంబ సభ్యులు గజమాలతో స్వాగతం పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తారు రోడ్డు ప్రారంభించే ముందు దివంగత నేత వైఎస్సార్ విహ్రహానికి పూలమాల వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సులు రెడ్డి తదితరులతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో రైతుల ముంగిటకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా ఉన్న రైతు భరోసా కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని సేవలను పొందాలని కోరారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలను, మందులను అందించడం జరుగుతొందన్నారు. అంతేకాక గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, సిబ్బంది అందుబాటులో వుండి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతోపాటు అవసరమైన ఇతర సేవలను అందించడం జరుగుతొందన్నారు.
ఇది చదవండి : మహిళలు పురుషులకన్నా శక్తివంతులు- నారా బ్రాహ్మణి
రైతు భరోసా కేంద్రం రైతులకు ఒక దేవాలయంలా ఉందన్నారు. వైద్యరంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సంబేపల్లె మండలం గురిగింజ కుంట లో విలేజ్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2500 జనాభాకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లును నియమించారన్నారు. ఈ క్లినిక్ లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంటుందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటి వద్దకే నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి గొర్ల ఉపేంద్రా రెడ్డి, డీసీసిబి డైరెక్టర్ సేఠ్ వెంకట్రామి రెడ్డి, ఎం పి టి సి కేతి రెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ లు రఘునాధ రెడ్డి, దండు భూషణ్ రెడ్డి, జిల్లా జె సి ఎస్ కన్వీనర్ అమర నాధ రెడ్డి, వైకాప నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి