State Vishwa Brahmin Empowerment Committee :
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం టిడిపి జనసేన మరియు బిజెపి పార్టీల కలయికతో బీసీ సాధికార కమిటీ కింద బీసీలకు మంచి గుర్తింపు ఇచ్చిందని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ సమావేశమును డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు డాక్టర్ చింతాడ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీసీలకు కార్పొరేషన్ మరియు బిసిఏ కులస్తులకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్నా టిడిపి హయాంలో బీసీలకు కావాల్సిన పది ఎకరాల భూమిలో ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర కోఆర్డినేటర్ కనకాచారి అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో విశ్వబ్రాహ్మణులకు, చేతి వృత్తిదారులకు, స్వర్ణకారులకు అనేక రకాల పరికరాలు అందించిన ఘనత ప్రభుత్వానికి దొరుకుతుంది అని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహ చారి అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
బీసీ ప్రాతిపదికన మాకు మాకు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసినందుకుగాను సుమారు 15 నుండి 20 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు టిడిపికి మద్దతునిస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీని అదా పాతాళానికి తొక్కటమే మా లక్ష్యం అన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో బీసీలకు గుర్తింపు పరువైందని స్వర్ణకారులకు శిల్ప గార్లకు వేద పండితులకు అనేక రకాల ఆదరణ పథకాలు కింద వచ్చిన పరికరాలను తుప్పు పట్టించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. బొమ్మల తయారీదారులకు అటవీ శాఖ వారి నుండి ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఉచితంగా కల్పన అందించాలని శిల్పకారులకు దేవాలయాలపై ఉండే శిల్పాలు ఏర్పాటు కూడా రాతిని ఉచితంగా అందించాలని స్వర్ణకారులకు ముడిసరికైన బంగారం అనుకూలమైన సబ్సిడీ ధరలకు అందించాలని విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ముఖ్య ఉద్దేశం అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు రాష్ట్ర కోఆర్డినేటర్ సింహాద్రి కనకాచారి, రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహ చారి, కృష్ణా జిల్లా కన్వీనర్ శివకోటి రాజేంద్ర ప్రసాద్, మానేపల్లి బ్రహ్మాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టిడిపి సీనియర్ నాయకులు ఎల్లగొందల రాజశేఖర్, జన విజ్ఞాన వేదిక నాయకులు పెట్ల కామేశ్వరరావు మరియు డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి