మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమానికి ప్రజల నుండి విశేషణ స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరులోని యోగి మల్లవరం లో పర్యటించారు. ముందుగా పులివర్తి నానికి ప్రజల నుండి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్త లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ వైసీపీ అన్యాయాలు, నియంతృత్వ పోకడలతో పార్టీని వీడి టీడీపీ చేరుతున్నట్లు పెరుమాళ్, ఎంపిటిసి మహేశ్వరి తెలిపారు. నాపై నమ్మకంతో టీడీపీలో చేరిన పెరుమాళ్, మహేశ్వరి వారి అనుచరులకు నా కృతజ్ఞతలు చెప్పారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ, ఇంటి స్థలాలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాని, తుమ్మలగుంటలో పేద ప్రజల కోసం పోరాటం చస్తున్న నా సతీమణి పై దాడికి పాల్పడ్డారని తెలిపారు. అదే విధంగా ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు ఈ దాడికి పాల్పడి,- సాక్ష్యాధారాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అలాంటి ఘటన జరగలేదని ఎంఆర్ పల్లి సిఐ చెప్పడం శోచనీయం అన్నారు. పోలీసులు, ఇతర ఏ అధికారులనైనా గౌరవించడం మా సంస్కారంని,- రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన ఎన్డీయే లో చేరడం జరిగిందిని,2014లో టీడీపీ, జనసేన, బిజెపి కలయిన చారిత్రాత్మకమైనదిని, అప్పుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలంటే బిజెపితో అవసరం ఉంటుందని,- బిజెపికి సపోర్ట్ చేస్తూ ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, బడ్జెట్, పోలవరం ప్రాజెక్టు నిధులు కోసం చంద్రబాబు పోరాటం చేస్తామని చెప్పారు. టీడీపీ, జనసేన, బిజెపి కూటమిని ఆదరించండిని, అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, స్థానిక తెలుగుదేశం, జనసేన పార్టీకి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని…
156
previous post