సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరుపేదల కోసం పనిచేసేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన అక్కడి నుండి బిజినేపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలుపరిచేందుకు తామంతా కంకణ బద్ధులై పని చేస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుపేదల సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీలతోపాటు స్థానికంగా ఉన్న సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి కేటాయించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. రేవంతన్న దండుగా ప్రజాపాలనకు అండగా అనే నినాదంతో ముందడుగు వేస్తున్నామని చెప్పారు. అత్యధిక సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకే నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.
సీనియర్ నాయకుడు సుదీర్ఘ ఇంకా పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసిన మల్లు రవి అంటే నాకు అపారమైన గౌరవం ఉంది కానీ దళిత సామాజిక వర్గంలో అత్యధిక స్థానం జనాభా ఆక్రమించిన మాదిగ కే నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించి తీరాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన రాజకీయ కుయుక్తులతో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే సహించమని అనాదిగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీకి అండగా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించి తీరాలని డిమాండ్ చేశారు సీనియర్ నాయకుడు అగ్రజుడు ఎన్నో పదవులు అలంకరించిన మల్లు రవికి పార్టీలో కీలక స్థానం కేటాయించాలి కానీ నాగర్‌కర్నూలు స్థానాన్ని మాత్రం మాదిగలకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీ 6 గ్యారంటీలను అమలుపరిచి తీరుతామని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి తీరుతామని అన్నారు.100 రోజుల్లో ఎన్నికల హామీలను నెరవేర్చి ఈ ప్రాంత రుణం తీర్చుకున్నామని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి నమ్మించి, మెప్పించి అధికారాల్లోకి వస్తామని అన్నారు.
అధికార మదంతో విర్రవీగిన బీఆర్ఎస్ ను మట్టికరిపించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం… రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలమూరు, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని మైసిగండి, ఉమామహేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమాలకు కార్యరూపం దాల్చుతామని చెప్పారు. అధిష్టానం ఎవరికీ టిక్కెట్ ఇచ్చిన కలిసి పని చేస్తాం అత్యంత బలమైన సామాజిక వర్గం ఉన్న మాదిగలకే నాగర్ కర్నూల్ సీటు కేటాయించి తీరాలనీ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి ఇప్పటికీ 26 మంది దరఖాస్తు చేసుకున్నారు కానీ అత్యధిక మెజారిటీ స్థానం జనాభా ఉన్న ఎస్సీ మాదిగలకే టికెట్ కేటాయించి తీరాలి డిమాండ్ చేశారు. ప్రజల అండ దండలు కాంగ్రెస్ కు ఉన్నాయి 6 గ్యారంటీలతోపాటు స్థానిక గ్యారెంటీ ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందనీ అన్నారు.