సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా మొదలయ్యింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ డాల్బీ ధియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగింది. వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఉత్తమ సహాయ నటుడుగా రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటిగా డేవైన్ జో రాండాల్స్, బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ లో నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ కు అవార్డు దక్కింది. కార్డ్ జెఫర్ పన్ కు బెస్ట్ అడాఫ్టెడ్ స్ర్కీన్ ప్లే, జస్టిస్ట్ ట్రెట్, ఆర్ధర్ హరారీలకు బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే అవార్డు అందుకున్నారు. ఉత్తమ కాస్టూమ్ డిదైన్ వోలి వెడ్డింగ్ టన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్లుగా జెమ్స్ ప్రైస్, షానో హెత్ కు దక్కింది. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్ గా ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంపికయ్యింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా హెయటే వన్ హోయటేమా, ఉత్తమ వీజువల్స్ ఎఫెక్ట్స్‌గా గాడ్జిల్లా మైనస్ వన్, ఓపెన్ హైమర్-ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ దక్కింది. దా లాస్ట్ రిపేర్ షాప్-ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఎంపికయ్యింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ 20 డేస్ ఇన్ మరియాపోల్, ఉత్తమ సినిమాటోగ్రఫి ఓపెన్ హైమర్ కు దక్కింది.
అట్టహాసంగా మొదలైన ఆస్కార్ అవార్డుల వేడుక…
52
previous post