ఎన్నికల సమీస్తున్న తరుణంలో నేతల మాటల తూటల కన్నా… ఫ్లెక్సీల రగడే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరొకసారి ఫ్లెక్సీల వార్ మొదలైంది. తాడిపత్రికి నారా లోకేష్ వస్తున్న తరుణంలో టిడిపి నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బస్టాండ్ ఆవరణ నుంచి కడప రోడ్ వరకు కట్టిన ఫ్లెక్సీలను అర్ధరాత్రి సమయంలోగుర్తు తెలియని వ్యక్తులు వాటిని చింపి వేశారు. ఇది గమనించిన టిడిపి నాయకులు సరౌండింగ్ లో ఉన్న సీసీ కెమెరాలు ఉన్నచోట ఆరా తీయగా, సీసీ కెమెరాలకు చేయి అడ్డంపెట్టి ఫ్లెక్సీలను చింపేసినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఇటువంటి పరిస్థితి నెలకొనడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే … సిబ్బంది పట్టించుకోలేదని వాపోతున్నారు.
నేతల మాటల తూటాల కన్నా… ఫ్లెక్సీల రగడే
83
previous post