తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేశ్, హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో వీరు నలుగురు బీజేపీలో చేరారు. బీజేపీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నాయకులు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్…
110