రైతులు ధాన్యం అమ్మి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా వారి అకౌంట్లు డబ్బులు పడకపోవడం దారుణమని,రైతు ప్రభుత్వం అంటూనే రైతుల వెన్ను విరుస్తున్నారు అని పెనమలూరు తెలుగుదేశం నియోజకవర్గం ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు.
ధాన్యం తోలిన రైతులకు డబ్బులు చెల్లించకపోవడం అలాగే సన్నా చిన్నకారు రైతుల వద్ద ధాన్యం కొనుగోలుకు అనేక ఇబ్బందులు పెడుతున్నారంటూ ఉయ్యూరు ఆర్డిఓ కార్యాలయం ఎదుట తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో రాజుకు వినతి పత్రం సమర్పించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటు ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని నాని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వెలగపూడి శంకర్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు కుదూస్, జంపాన పూర్ణచంద్రరావుతో పాటు జనసేన నేతలు రాజా ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ:
రైతులు ధాన్యం మిల్లర్లకు తోలి మూడు నెలలు గడుస్తున్న ఇంకా ఎకౌంట్లో డబ్బులు పడటం లేదని నీతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయినా ఈ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.
సన్న చిన్న కారు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని దీంతో రైతులు ఆ ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆర్బికే పేరుతో జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని ఆర్థిక వలన ఎలాంటి ప్రయోజనము లేదన్నారు.
మాది రైతు ప్రభుత్వం మా బీసీ మాయ ఎస్సీ మా ఎస్ టి అంటున్న జగన్మోహన్ రెడ్డి అదే రైతులు అదే బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు నట్టేట మునుగుతున్న పట్టించుకోకపోవడం ఆయన కపట ప్రేమకు నిదర్శనం అన్నారు.
రైతు సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బోడె ప్రసాద్ హెచ్చరించారు.
ఇది చదవండి: భర్త చావుని జీర్ణించుకోలేక భార్య మృతి..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి