యూట్యూబ్ ఒక దిగ్గజం, దాని పాపులారిటీ ఎంత చెప్పినా తక్కువే. అయితే, ఇటీవల ఎక్స్ టీవీ యాప్ రూపంలో ఒక గట్టి పోటీదారు బయటకు వచ్చింది. ఈ యాప్ యూట్యూబ్ కు గట్టి పోటీ ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ కుబేరుడిగా వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా రాణిస్తున్నారు ఎలాన్ మస్క్. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మస్క్. అతి పెద్ద స్క్రీన్ పై చూడగలిగే విధంగ ఎక్స్ టీవీ యాప్(X TV app) ను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఫార్చ్యూన్‌లోని ఒక నివేదిక ఈ మేరకు పేర్కొంది.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
సరికొత్త ఎక్స్ టీవీ యాప్(X TV app)…
యూట్యూబ్(Youtube) లో యూజర్లు డిఫరెంట్ కంటెంటతో వీడియోలు రూపొందించి అప్ లోడ్ చేసి ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ కన్ను యూట్యూబ్ పై పడింది. యూట్యూబ్ తరహాలోనే కొత్త టీవీ యాప్ ను వచ్చే వారం లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. చూడాలి మరి ఎలన్ మాస్క్ ఎలాంటి కొత్త మార్పులతో ఎక్స్ టీవీ ని తీసుకువస్తాడో. ప్రపంచ కుబేరులలో టాప్ 10 లో ఒకరిగా ఆయన కొనసాగుతున్నారు. తాజాగా ఆయన ఈ లిస్టులో మొదటి స్థానం నుండి రెండోస్థానానికి పడిపోయారు.ఇకపోతే సోషల్ మీడియా దిగజాలలో ఒకటైన ఎక్స్ ను ఆయన కొనుగోలు చేసిన తర్వాత అందులో అనేక మార్పులు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి