పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ లో ఆర్టీసీ నూతన రాజధాని బస్ (Rajdhani Bus) ను మంత్రి శ్రీధర్ బాబు (Sridhar babu) రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులతో కలిసి బస్సులోకి ఎక్కి సీట్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు దాదాపు 23 కోట్ల జీరో టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. 6 గ్యారంటీలో ప్రధానమైన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం విజయవంతంగా నెరవేర్చుతున్నామని తెలిపారు. నష్టాలు ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్ ను మూడు నెలల్లో నష్టాలు లేకుండా చేశామని, మంథని, మహాదేవ్ పూర్, కాళేశ్వరం బస్టాండ్లలో అధునాతన సౌకర్యాలు కల్పించి, ప్రయాణికులకు మరింత సౌకర్యంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ బస్ స్టేషన్లు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నేడు వైఎస్సార్ ఈబిసి నేస్తం నిధులను విడుదల చేయనున్న సీఎం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి