కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనపై మంత్రి దామోదర రాజనర్సింహా పై మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ చేసిన మాటలపై పటాన్ చెరు నియోజకవర్గం ఇంచార్జీ కాట శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లక్డారం క్వారీ విషయంలో గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి 30 కోట్ల రాయల్టిని ఎగ్గొట్టారన్నారు. పరిమితికి మించి 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు అక్రమంగా మైనింగ్ చేశారన్నారు. 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టారని చెప్పారు. నాటి ఫ్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారన్నారు. మిగతా అక్రమ క్వారీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు వాటిల్లో మీకెంత వాటా ముట్టిందని ప్రశ్నించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదరుడు అరాచకాలు అంతా ఇంతా కాదని, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా గతంలో దొంగలకు సద్ది కట్టారన్నారు. చెరువులు, కుంటలు కబ్జా చేసి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా 10-3-23 నాడే క్లోజర్ ఆర్డర్ వచ్చినా.. అధికారులు దాచి పెట్టారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఈ వ్యవహారం చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి దాచుకున్నారన్నారు. పుట్టుకతో భూస్వామిని అంటున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 2014 లో తన అఫిడవిట్ లో ఆస్తుల చిట్టా తీస్తే తెలుస్తుందన్నారు.
ఇది చదవండి : రేపు మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
హరీష్ రావుకు పటాన్ చెరు ను ఏటియం గా మార్చుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అవసరం లేదని, ఆయనను ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు. అక్రమ దందాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇదే మాజీ మంత్రి హరీశ్ రావు నన్ను గతంలో టీఆర్ఎస్ లోకి రావాలని ఒత్తిడికి గురిచేసి ఒప్పుకోకపోతే తనను సర్పంచ్ పదవి నుంచి తొలగించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా ప్రభుత్వం నడిపిస్తుంది. అవినీతిని ప్రోత్సహించేది లేదన్నారు. హరీశ్ రావు బాగోతాలు అందరికీ తెలుసు.. ఏ భూమి కబ్జా అయినా, ఎక్కడ అవినీతి జరిగినా వారి హస్తం ఉంటుందన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం లో జరిగిన భారీ కుంభకోణాలలో హరీశ్ రావు వాటా ఎంతో చెప్పాలన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహపై హరీశ్ రావు అసంబద్ధ ప్రేలాపనలు తగదన్నారు. 40 వేల ఓట్ల దొంగ ఓట్లతో గెలిచిన మహిపాల్ రెడ్డిది ఓ గెలుపా అని, నిజంగా నిజాయితీ ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఇపుడే మహిపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఇద్దరం ఎన్నికలకు పోదాం.. 30వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సవాల్ విసిరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి