Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh నంద్యాల రాజకీయాల్లో సంచలనం…

నంద్యాల రాజకీయాల్లో సంచలనం…

by Prakash
Sensation in Nandyala's politics

నంద్యాల జిల్లా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనతో తలపడపోతున్న ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన కోట్ల సూర్య ప్రకాష్ తండ్రి విగ్రహాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆవిష్కరించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆవిష్కరించడం ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్యాపిలిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాలని 12 ఏళ్ల క్రితమే విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు కోట్ల విగ్రహం ఆవిష్కరణకు నోచుకోలేదు. విగ్రహానికి బట్ట చుట్టి మూసేశారు. ప్రస్తుత ఎన్నికలవేళ కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించడం పట్ల చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తెలుగు దేశం పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. అతనికి పోటీగా రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ తరఫున తలపడుతున్నారు.వాస్తవంగా సూర్య ప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే విగ్రహ ఏర్పాటు చేశారు. ఎందుకో కానీ ఇప్పటివరకు ఆవిష్కరణకు నోచుకోలేదు. అయితే తాజాగా మంత్రి బుగ్గన కోట్ల విగ్రహాన్ని ఆవిష్కరించడం కొబ్బరి కాయలు కొట్టాడంతో ఒకింత కోట్ల వర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ అంటూ కోట్ల వర్గీయులు కొట్టి పారేస్తున్నారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహంతో పాటు రావు బహద్దూర్ బిరుదాంకితుడు బుగ్గన శేషారెడ్డి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను కూడా మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. అయితే తన తండ్రి విగ్రహాన్ని బుగ్గన ఆవిష్కరించడం పై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఇపుడు సర్వత్రా ఆసక్తి మారింది.

Advertisements

You may also like

Our Visitor

025658
Total views : 147630

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.