ప్రేమ వివాహం (Love Marriage) చేసుకుని రక్షణ కల్పించాలని కోరుతూ నూతన వధూవరులు నర్సీపట్నం పోలీసులను (Police protection) ఆశ్రయించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రేమ వివాహం చేసుకున్న కీర్తన – చంద్రశేఖర్ జంట తమపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా కంచరపాలెంకు చెందిన చంద్రశేఖర్, NAD కాకాని నగరానికి చెందిన కీర్తన గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పకుండా ఫిబ్రవరి 14న తిరుపతిలో వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో కీర్తన తండ్రి వీరి ప్రేమను అంగీకరించకుండా చంద్రశేఖర్ పై కిడ్నాప్ కేసు పెట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇద్దరు మేజర్లు కావడంతో మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఈనెల 13న సింహాచలంలో మరోసారి వివాహం చేసుకున్నారు. ఇదిలావుంటే గురువారం విశాఖలో కొంతమంది తమపై దాడి చేసి కొట్టారని ఆరోపించారు. వారి నుంచి తప్పించుకుని నర్సిపట్నం శారదానగర్ లో ఉన్న లాడ్జీలో దిగామని, అక్కడికి వచ్చి కూడా కొట్టారని బాధితులు వాపోయారు. పట్టణ సిఐ క్రాంతి కుమార్ ను కలిసి తన తండ్రి బారి నుంచి రక్షణ కల్పించాలని యువతి కోరింది. అయితే దీనిపై సిఐ వివరణ కోరగా.. ప్రేమజంట కంచర్లపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామంటే పంపించామని తెలిపారు.
ఇది చదవండి: లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి