Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home National లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్..

లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్..

by Rama
Aravind kejriwal

లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Aravind Kejriwal)కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. లక్ష పూచికత్తు, 15వేల బాండ్ సమర్పించాలని కోర్టు సీఎం కేజ్రీవాల్ కు స్పష్టం చేసింది. కాగా దర్యాప్తునకు సహకరించాలని అధికారులు పంపిన నోటీసులకు స్పందించకపోవడంతో కోర్టులో ఈడీ సీఎం కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో రెండుసార్లు సమన్లను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జారీ చేసింది. తనకు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును అరవింద్ కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ పిటీషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు తోసి పుచ్చింది. కోర్టు తన విజ్ఞప్తిని పరిశీలించకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందు ఇవాళ హాజరయ్యారు. కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరగా… అనూహ్యంగా కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరయింది.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

ఇది చదవండి: ఏపిలోఅధికార, ప్రతిపక్ష పార్టీల నేత మధ్య డైలాగ్ వార్


సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ …
ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్‌చంద్రకు ప్రధాని మోదీ నివాళి.
ప్రముఖ బెంగాలీ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ …
ఉద్యోగులకు కేంద్రం కీలక నిర్ణయం.
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: