నరసాపురం జనసేన అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ఖరారు చేయలేదని జనసేన నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (kothapally subbarayudu) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆయన అభిమానులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధిష్టానం టీడీపీ, జనసేన కూటమి శాసనసభ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయలేదని అలా ఖరారు చేసినట్లు తనకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పీఎం నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు లతో కలిసి పనిచేస్తున్నారని నేను కూడా నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. పార్టీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసినట్లు తనకేమీ సమాచారం లేదని తాను మాత్రం కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటానని అన్నారు. తనకు బల ప్రదర్శన చేయవలసిన అవసరం లేదని తనకు అన్ని సామాజిక వర్గాల్లోనూ అభిమానులు అనుచరులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి