“ఎన్డీఏ ప్రజాగర్జన సభ ఘన విజయం – జగన్ గారి శిబిరానికి ఎన్నికలలో ఓటమి భయం”
పది లక్షల మంది ప్రజల స్వచ్ఛంద సహకారంతో నిన్న బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగర్జనతో జగన్ గారు తట్ట బుట్ట సద్దె పనిలో నిమగ్నమయ్యారు. జగన్ గారి నాలుగు సిద్దం సభలు అధికార మరియు ప్రజాధన దుర్వినియోగంతో జరిగితే ఎన్డీఏ మొదటి ప్రజాగర్జన సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కనపడగానే 2014 లో ఎన్డీఏ కి వరించిన విజయం మించిన విజయం 2024లో తథ్యం అనే భయాందోళనలో జగన్ గారి శిబిరం పడింది. రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తులు ఏకం కావాలని రాష్ట్రంలో ప్రజల కోరిక. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలను అవినీతి, అరాచక పాలన నుండి రక్షించుకొని సమ్మిళిత అభివృద్ధి దిశగా ఎన్డీఏ పాలనలో అడుగులు పడాలని ప్రజల ఆకాంక్ష.
మోడీ గారు సంకల్పించిన వికసిత భారత్ లో భాగం వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యం. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత జగన్ గారి ట్రబుల్ ఇంజన్ సర్కార్ పోయి దేశంలోఅభివృద్ధి సంక్షేమానికి చిరునామా అయిన డబుల్ ఇంజన్ సర్కార్ అనివార్యం. రాష్ట్రానికి ఇప్పుడున్న అవినీతి, అరాచక, విధ్వంసక పాలన ప్రమాదం నుండి కాపాడుకోవడం మాత్రమే త్రిమూర్తుల వంటి ఈ మూడు పార్టీల కింకర్తవ్యం. 2018 లో జరిగిన పొరపాటు ఒక్క ఛాన్స్ అంటే ఒక్క చుక్క విషం అని ప్రజలు గమనించలేక పోయారు, ఇప్పుడు రాష్ట్రానికి అమృతం అవసరం. రాష్ట్రంలో ప్రజలకు 2019లో మధ్య నిషేధం , రైతుల ధరల స్థిరీకరణ నిధి, యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి అన్న జగన్ గారు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జగన్ గారి పాలనలో మద్యం మాఫియాతో, ల్యాండ్, సాండ్, మైన్ మాఫియా పెట్రేగి పొయ్యరు. రాష్ట్రంలో వనరుల దోపిడీ తప్ప ప్రజలకు ఆరోగ్య వంతమైన వసతులు ఏమీ కల్పించారో చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు వైకాపా బరితెగిస్తుంది. రైతులకు భీమా ప్రీమియం చెల్లించకుండా జగన్ గారి ప్రభుత్వం అన్యాయo చేసింది. 2019 అనంతరం పారిశ్రామికవేత్తలను భయకంపితులను చేయడంతో రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడంతో యువతకు ఉద్యోగ మరియు ఉపాధి లేకుండా జగన్ గారి పాలన సాగింది. అమరావతిలో జగన్ గారు నిర్వీర్యం చేసిన అభివృద్ధి మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో ఏర్పాటు తథ్యం.
ఉత్తరాంధ్ర రాష్ట్ర అర్థిక రాజధానిగా, రాయలసీమ ఎలెక్ట్రానిక్ మరియు ఆటోమొబైల్ తయారు రంగ రాజధానిగా రాబోయే ఎన్డీఎ డబుల్ ఇంజన్ సర్కార్ రూపుదిద్దుతుంది. వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన 52 ఎకరాల భూమిని రాష్ట్రంలో పాలన సాగిస్తున్న జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల వాటి నిర్మాణానికి అంతరాయం కలిగింది. కర్నూల్ హై కోర్టు అంశంలో జగన్ గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రబుత్వం సుప్రీం కోర్ట్ లో వేసిన అఫిడవిట్ ని చదివే దమ్ము జగన్ గారికి ఉందా. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల పైన జగన్ గారి కన్ను పడిందా లేదా అయినే చెప్పాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను మోడీ గారీ ప్రభుత్వం లేకుంటే తల్లి పిల్ల కాంగ్రెస్ నాయకులు పంచుకునేవారు.
ఒక్కసారి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను లాగేసుకోవాలని మీరు వేసిన ప్రణాళికకు సాధ్యం కాదన్న నాటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారుని వేధించారా లేదా. కేంద్రంలో ప్రభుత్వ రంగ ఆస్తుల విలువ 2014లో 9 లక్షల కోట్లు మాత్రమే కాకుండా, నష్టాలతో నడుస్తూ ఉంటే నేడు మోడీ గారు ప్రధాని అయ్యాక నేడు లాభాల బాటలో నడుస్తూ వాటి నికర ఆస్తుల విలువ దాదాపు 20 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రధాని మోడీ గారు హెడ్ లైన్ లో పేరు పడడం కోసం కాకుండా డెడ్ లైన్ లోపు అభివృద్ధి సంక్షేమం కోసం పని చేస్తారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సమాచారం ఇవ్వకుండా జగన్ గారు తమ మిత్రులకు కట్టబెట్టేందుకు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసింది నిజమా కాదా?
దుగ్గరాజు పట్టణం పోర్ట్ నిర్మాణం సాధ్యం కాదని తెలిసినా విభజన చట్టంలో పెట్టినప్పుడు ఎంపీ గా ఉన్నా జగన్ గారు ఏమి చేశారు. నిన్న కాక మొన్న 10 వేల కోట్లు 2014-15 రెవిన్యూ లోటు నిధులు కేంద్రం నుండి తెచ్చుకుని జగన్ గారు ఎవరికి ధన్యవాదాలు తెలిపారు. పోలవరం మొదటి దశపూర్తికి అవసరమైన నిధులు కేంద్రం ఆమోదించినందుకు జగన్ గారు ధన్యవాదాలు ఎవరికి తెలుపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, మౌలిక సదుపాయాలు కల్పన లేకుండానే మచిలీపట్టణం పోర్ట్ , రామాయపట్టణం పోర్ట్ నిర్మాణం జరుగుతుందా? బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం పూర్తి చేయడానికి సహకరిస్తున్నా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు మారిపోయి నిర్మాణ వేగం మందగించి ఆలస్యం చేస్తుంది. 2019 ముందు 72 శాతం పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరిగినా, ప్రస్తుతం ఆ వేగం పూర్తిగా మందగించింది అనే విషయాన్ని సుస్పష్టం. రాష్ట్రంలో రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా పోలవరం పనులు పూర్తి చేస్తుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బొప్పిడి సభకు సమీపంలో నిర్ళించిన ఎయిమ్స్, ఆచార్య రంగా వ్యవసాయ యూనివర్సిటీ తో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని సంస్థలు, విద్యాలయాలను ప్రస్తావించడం ద్వారా ప్రజలకు ప్రధాని మోడీ గారు వాస్తవాలను ఆవిష్కరించారు. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల మళ్లింపుతో పంచాయితీల అభివృద్ధిని జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరోధించడం నిజమో కాదో అందరికీ తెలుసు. రాష్ట్రానికి 5 పారిశ్రామిక నోడ్లు విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో మరియు రెండు నిమ్జ్ లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ప్రభుత్వ భూమి ఉండి కేటాయించని అసమర్థ ప్రభుత్వo జగన్ గారు నడిపారు.
పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆంధ్ర ప్రదేశ్ లో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2.67 కోట్ల మంది, పీఎం ఆవాస్ యోజన ద్వారా 25 లక్షల గృహాలు, 1.57 కోట్ల అయుష్మాన్ భారత్ కార్డులు, జల్ జీవన్ మిషన్ ద్వార 95 లక్షల గ్రామీణ గృహాలకు కుళాయి ద్వారా సురక్షిత త్రాగు నీరు అందించే లక్ష్యం, 50 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి క్రింద సంవత్సరానికి 6000 రూపాయలతో పాటు ప్రతి ఎరువు బస్తా పైన 2000 రూపాయల సబ్సిడీ కోసం ఆంధ్ర ప్రదేశ్ కి సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయిలకు పైగా భారం కేంద్రం మోస్తుంది. జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద ఆంధ్ర ప్రదేశ్ కి సంవత్సరానికి 16 వేల కోట్ల రూపాయిలకు పైగా భారం కేంద్రం మోస్తుంది. ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం నుండి 80 నుండి 85 వేల కోట్ల రూపాయలు వరకు కేంద్ర పన్నులలో భాగం, గ్రాంట్లు , వివిధ పథకాల క్రింద రాష్ట్రానికి సహాయం అందుతున్న వాస్తవాలు చప్పాలి అంటే జగన్ గారికి ధైర్యo ఉండాలి.
ఇప్పటికే దేశంలో అత్యధిక “ లాక్ పతి దీదీ “ లు 13.65 లక్షలు తయారు కావడం, పీఎం విశ్వకర్మ యోజన క్రింద దాదాపు 2 లక్షల మంది రిజిస్టర్ కావడం, వీది వ్యాపారుల కోసం “ పీఎం స్వనిధి “ ద్వార 4 లక్షలకు పైగా వ్యాపారులకు సబ్సిడీ రుణాలు ఇస్తుంటే ఈ పథకాల పైన రాష్ట్రంలో పాలకులు వారి పేర్లు లేదా వారి కుటుంబ సభ్యుల పేర్లతో స్టిక్కర్లు వేస్తున్నది నిజం అని చెప్పే దమ్ము జగన్ గారికి ఉందా?
రాష్ట్రంలో పేదలకు, రైతులకు అందుతున్న సంక్షేమంలో సగటున 60% కేంద్రం నుండే అని ప్రజలకు అర్థం అవుతుంది. రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వే ల మౌలిక సదుపాయాల. అభివృద్ధి పైన చర్చ పెడితే రాష్ట్రప్రభుత్వ అలసత్వ భండారం బయటపడుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఒక అన్నా, ఒక చెల్లి మధ్యలో తల్లి నాటకానికి తల్లి పిల్ల కాంగ్రెస్ ల సంయుక్త నాటకం ప్రధాని బయటపెట్టారు. కాంగ్రెస్ విష వృక్షంలోని విత్తనం జగన్ గారు, ఆ విత్తనం అవినీతి అరాచక మొక్కగా మొదలై నేడు ఊడలు తిరిగిన అతిపెద్ద మానుగా మారి రాష్ట్రాన్ని కబళిస్తుంటే భాద్యత కలిగిన రాష్ట్ర పౌరులు ఎవరు గతాన్ని తవ్వుకుంటూ వర్తమాన భాద్యతను విస్మరించి రాష్ట్ర భవిష్యత్ ను నిర్వీర్యం కావడానికి ఒప్పుకోరు. కేంద్రం సహకార సమైఖ్య స్పూర్తితో సహకరిస్తే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వినియోగించుకొని రాష్ట్రం అభివృద్ధి కోసం కాకుండా వారి స్వంత వారి జేబులు నింపే పనిలో పడిపోయారనే భావన ప్రజలలో ఉంది.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి