సజావుగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భారత్ ఎన్నికల కమిషనర్ మార్గ ప్రకారం లోక్ సభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తమవంతు సహకారం జిల్లా ఎన్నికల అధికారి కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
భారత ఎన్నికల కమిషనర్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసిందని ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని ఏప్రిల్ 18 నుంచి 25 తేది వరకు ఉంటుందని ఏప్రిల్ 26 నామినేషన్స్ స్కూటీని ఏప్రిల్ 29 వరకు నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంటుందని మే 13న పోలింగ్ జూలై 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఓటర్ జాబితా సవరణ తుది ఓటర్ జాబితా ప్రకారం ఏడు లక్షల 15,735 మంది ఓటర్లు 628 మంది సర్వీస్ ఓటర్లు 53 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని పెద్దపెల్లి నియోజకవర్గ పార్లమెంటు పరిధిలోని 1850 పోలింగ్ కేంద్రాలు మొత్తం 15 లక్షల 92,996 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్కటి ఓటర్ జాబితాలో తమ పేరును సరి చేసుకోవాలని జాబితాలో లేని పేరు వారిని ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఫిర్యాదు ప్రజలకు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సి-విజల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. ఈ సర్వీసు 24 గంటల పాటు కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గాని యాప్ ద్వారా గాని చేయవచ్చని అన్నారు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్స్ ఫ్లెక్సీలను ఫొటోస్లను ప్రభుత్వ కార్యాలయం పని గానీ 24 గంటల్లోపు వ్యవధిలో బస్టాండు రైల్వే స్టేషన్ పెట్రోల్ బంకులను మొదలైవి పబ్లిక్ ప్లేస్లో 48 గంటల వ్యవధిలో అనుమతి లేని ప్రైవేటు స్థలంలో 72 గంటల వ్యవధిలో పూర్తిస్థాయిలో తొలగిస్తామని ఎన్నికల దృష్టిలో ప్రజలు ఆధారాలు లేకుండా 50,000కు మించి నగదును ప్రయాణించవద్దని ప్రతి రోజు తనిఖీల్లో జప్తి చేసిన సొమ్మును జిల్లా ఏర్పాటు చేసిన గ్రీన్ కమిటీ ద్వారా అప్పగించారని, ఆధారాలు సమర్పించి గ్రీవేస్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు.
ఇది చదవండి: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి