‘‘సార్… గత మూడు నెలలుగా గిరాకీల్లేవు. పైనాన్స్ తెచ్చి ఆటోనడుపుతున్నం. అప్పులకు వడ్డీలు కూడా కట్టేలేకపోతున్నం. అంతంత మాత్రమే గిరాకీలు వస్తున్నయ్. బడి పిల్లలను తీసుకెళుతుండటంతో వాళ్లిచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తోంది. ఎండాకాలం సెలవులు రాబోతున్నయ్. బడి పిల్లల గిరాకీ కూడా ఉండదు… అసలు అప్పులు బాధ దేవుడెరుగు.. ఎట్లా బతకాలో కూడా అర్ధం కావడం లేదు’’కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ఎదుట ఆటోవాలాలు పెట్టుకున్న మొర ఇది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లోని సెయింట్ జాన్స్ స్కూల్ వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్లను కలిశారు. వారితో కలిసి ఛాయ్ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇన్సూరెన్స్ కూడా చెల్లించే పరిస్థితి లేదన్నారు. ఒకవైపు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయని వాపోయారు. రాబోయే రెండు నెలలపాటు స్కూళ్లు కూడా ఉండవని, తమకు ఇల్లు కూడా కష్టమయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ….‘‘మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదే. అదే సమయంలో మిమ్ముల్ని (ఆటో డ్రైవర్లను ఉద్దేశించి) కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉపాధికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.’’అని అభిప్రాయపడ్డారు. బాధపడాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు..
ఇది చదవండి: వైసిపీ నేతల ఆత్మీయ సమావేశం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి