బీజేపీ(BJP) ఐదో జాబితా రిలీజ్..
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్(Election Schedule) విడుదల కావడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ(BJP) దూకుడు పెంచింది. ఈ సారి 400 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ.. తీవ్ర కసరత్తు అనంతరం క్యాండిడేట్ల లిస్ట్‌ను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటి వరకు నాలుగు జాబితాలను రిలీజ్ చేసిన బీజేపీ.. ఎంపీ అభ్యర్థుల మరో లిస్ట్‌ను విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో బీజేపీ ఐదో లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్(Star Heroine) కంగనా రనౌత్(Kangana Ranaut)కు బీజేపీ టికెట్ కేటాయించింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఏపీ, తెలంగాణ నుంచి సైతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్ఠానం విడుదల చేసింది. ఏపీ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి ఇద్దరిని ఖరారు చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఏపీ లోక్‌సభ అభ్యర్థులు..అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమహేంద్రవరం నుంచి పురందేశ్వరి, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తిరుపతి (ఎస్సీ) నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
ఇది చదవండి: 46 మందితో కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితా విడుదల..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి