లేనిపోని కల్లబొల్లి సాకులతో పార్టీలు మారడం తగదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు , ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ బాబు అన్నారు…
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం ఏలేశ్వరం పట్టణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజవర్గంలోని వైసిపి పార్టీకి పెరుగుతున్న బలాన్ని చూసి ఓర్వలేక ప్రక్క పార్టీ నాయకులతో కలిసి లేనిపోని సాకులతో పార్టీల మార్పుకు కల్లబొల్లి మాటలతో మారడం తగదని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ ఏదైతే పక్కన నియోజవర్గం నుండి వచ్చిన నాయకుడు అంటున్నారే ఆయన ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అని ఆయన జిల్లాలో ఎక్కడైనా తిరిగి అవకాశం ఉందని అన్నారు. స్థానికంగా నా బంధువు ఆయన.. ఆయన వైసిపి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాడని స్థానిక నగర పంచాయతీలో పార్టీని తూంగలోకి తొక్కే ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కుంటి సాకు చూపి పార్టీకి రాజీనామా చేశారని, పార్టీ గుర్తుపై గెలిచిన పదవులు అవసరం కానీ పార్టీ అవసరం లేదా అంటూ వారు ఎద్దేవా చేశారు.