Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి…

కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి…

by Prakash
Aam Aadmi Party


ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ (Aam Aadmi Party (AAP) :

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ (Aam Aadmi Party (AAP) chief), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా స్పందించగా, తాజాగా ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఎన్నికలు జరిగే ఇండియా సహా ఇతర దేశాల్లో ప్రజల ‘రాజకీయ, పౌర హక్కులు’ రక్షించబడతాయని బలమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ‘స్వేచ్ఛగా, న్యాయంగా’ ఓటు వేసే వాతావరణం ఉంటుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనతో లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత్‌లో నెలకొన్న ‘రాజకీయ అశాంతి’పై అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు.

అమెరికా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్…

ఇవే విషయాలపై అమెరికా కూడా ఇలాగే స్పందించడం గమనార్హం. అమెరికా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్.. తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఘాటుగా హెచ్చరించింది. అంతేకాదు, అమెరికా వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ దేశ రాయబారికి సమన్లు కూడా ఇచ్చింది. మరి ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యలపై భారత్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

ఇది చదవండి : పార్లమెంట్ ఎన్నికల రెండవ దశ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల


పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..
పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు …
మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె …
పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.
రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023356
Total views : 141819

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.