దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నది సామెత. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ(GHMC) వ్యవహారం అచ్చం ఇలాగే కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ట్యాక్స్ వసూళ్ల దందా సాగుతోంది. పన్ను వసూళ్ల పేరిట వినియోగదారులకు వేధింపులు కొనసాగుతున్నాయి. పన్ను పెనాల్టీల వసూళ్లలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పన్ను అపరాధ రుసుములో 10 శాతం మినహాయింపు ఇచ్చింది. అయితే, పన్ను కట్టేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నా.. వాటిని తీసుకునే విషయంలో కొందరు అధికారులు, సిబ్బంది సవాలక్ష షరతులు(ghme rules) విధిస్తున్నారు.
ఒకే చెక్కు ఇవ్వాలంటూ వినియోగదారులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఏఖాతాలో డబ్బు ఉంటే ఆ ఖాతా చెక్కు ఇస్తామంటే తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. పైగా.. ఇదేంటని ప్రశ్నిస్తే అన్నింటికీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేరు చెబుతున్నారు. తమ కమిషనర్ రోనాల్డ్ రోస్ చాలా స్ట్రిక్ట్ అంటూ కిందిస్థాయి ఉద్యోగులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
జీహెచ్ఎంసీ(GHMC) స్థలాల ఆక్రమణ ఎందుకు ఆగడం లేదు?
కమిషనర్ అంత స్ట్రిక్ట్ అయితే… జీహెచ్ఎంసీ(GHMC) స్థలాల ఆక్రమణ ఎందుకు ఆగడం లేదు? అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో పెద్దమొత్తంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాల పాలవుతున్నాయి. ఏ ఇంజనీరింగ్ పనిలో చూసినా అవినీతి కంపు స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మించిన కొంత కాలానికే నాణ్యతా లోపాలు బట్టబయలవుతున్నాయి. కాల్వల పూడిక తీత పనుల్లోనూ అవినీతి కంపు కొడుతోంది.కోట్లలో పన్ను రావాల్సిన చోట నోరు మెదపని అధికారులు.. టాక్స్ చెల్లిస్తామంటున్న వాళ్లను మాత్రం వేధింపులకు గురిచేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి