ఇప్పటి వరకు 13 మంది అభ్యర్థుల ప్రకటన..
తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(CM Mallu Bhatti Vikramarka) నేడు మరోసారి ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. వీరితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ సైతం హస్తినకు వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి వీరు హాజరుకానున్నారు. కాగా, దేశవ్యాప్తంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రకటించకుండా ఉన్న పార్లమెంట్ స్థానాలపై చర్చించి.. అనంతరం అభ్యర్థుల ఫైర్లను సీఈసీ ఫైనల్ చేయనుంది. తెలంగాణలో సైతం మరో నాలుగు పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు.
ఇది చదవండి: అరేబియా సముద్రంలో దొంగల దాడి..!
ఈ నేపథ్యంలో ఈ నాలుగు స్థానాల అభ్యర్థుల ఎంపికపై సీఈసీలో చర్చించేందుకు తెలంగాణ నుండి రేవంత్, భట్టి, మున్షీ ఢిల్లీకి వెళ్తున్నారు. సీఈసీలో చర్చించిన అనంతరం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న లోక్ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గానూ కాంగ్రెస్ 13 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నాలుగు స్థానాల్లో ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి