మనం ప్రయాణాల సమయంలో లేదా ఎక్కడికైనా బయటకి వెళ్లినప్పుడు సడెన్ గా మన ఫోన్(Phone) లో లేదా ల్యాప్‌టాప్(Laptop) లో ఛార్జింగ్(Charging) అయిపోతే మనం సాధారంగా పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్(Public Charging Port)లను ఉపయోగిస్తాము. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు వంటిచోట్ల పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌ల ద్వారా ఫోన్ కి, ల్యాప్‌టాప్ కి ఛార్జింగ్ పెట్టుకుంటుంటారు చాలామంది. అయితే పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్ నుండి ఛార్జింగ్ ఎంత ప్రమాదకరమో తెలుసా? మీ డివైజ్ ని.. పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్ నుండి ఛార్జింగ్ చేసుకోవడం వల్ల మీరు జ్యూస్ జాకింగ్ సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదముంది. ఈ విషయానికి సంబంధించి, భారత ప్రభుత్వం USB ఛార్జర్ స్కామ్(USB Charger Scam) గురించి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వినియోగదారులను హెచ్చరించింది.
USB ఛార్జర్ స్కామ్ నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
- మీ మొబైల్ ని ఛార్జ్ చేయడానికి ఎలక్ట్రికల్ వాల్ అవుట్‌లెట్‌ని ఉపయోగించడం మంచిది.
- మీ స్వంత కేబుల్ లేదా పవర్ బ్యాంక్ తీసుకెళ్లడానికి ప్రయత్నించండి.
- మీ మొబైల్ పరికరాన్ని లాక్ చేయండి, కనెక్ట్ చేయబడిన పరికరాలతో జత చేయడాన్ని నిలిపివేయండి.
- తొలగించగల స్టోరేజ్ డివైజ్ లలో పోర్ట్‌లకు యాక్సెస్‌ను నిరోధించడానికి USB డేటా బ్లాకర్‌లను ఉపయోగించండి.
- ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ ప్రెష్ గా ఉంచండి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: 5G డేటా వినియోగం భారతదేశంలో 4G కంటే 4 రెట్లు ఎక్కువ!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి