2019లో వాయనాడ్ ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ(Rahul Gandhi)..
కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ కేరళ(Kerala)లోని వయనాడ్ నుంచి లోక్ సభ(Lok Sabha)కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆయన అమేథీ, వయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, అమేథీలో ఓడిపోయి, వయనాడ్ లో గెలిచారు. రాహుల్ గాంధీ ఈసారి కేవలం వయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు. ఇవాళ ఆయన వయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు.
ఇది చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..!
వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి రాగా, కోలాహలంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. నామినేషన్ వేసే ముందు కాంగ్రెస్ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన చెల్లెలు ప్రియాంక గాంధీని ఎలా చూసుకుంటానో, వయనాడ్ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటానని అన్నారు. మీ ప్రతినిధిగా పార్లమెంటులో ఉండడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను అని తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి