కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar)..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైతే మళ్లీ ఎంపీ పదవి ఏమైనా బండి సంజయ్ కి పునరావాస కేంద్రమా అని…రాజకీయాల్లో గెలుపోటములు సహజమని… ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) గారు అన్నారు. కరీంనగర్ 59 వ డివిజన్ కార్పొరేటర్ గందే మాధవి-మహేష్ గారి నివాసంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు గార్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్ ను స్మార్ట్ సిటీ చేసి ₹వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. కరీంనగర్ లో ₹50 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు.
బండి సంజయ్ కి ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రం..
కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లలో బండి సంజయ్ బడి తేలేదు…గుడి తేలేదని అన్నారు. కరీంనగర్ కు మంజూరైన ట్రిబుల్ ఐటీ బండి సంజయ్ అసమర్థత కారణంగా ఇతర రాష్ట్రాలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తరలించిందన్నారు. ఐదేళ్లలో ఊరు ముఖం చూడని బండి సంజయ్ కి ఇప్పుడు ప్రజలు గుర్తుకు వస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బండి సంజయ్ తెచ్చినట్లు ప్రగల్బాలు పలకడం భావ్యం కాదన్నారు.
కరీంనగర్ 59వ డివిజన్ కార్పొరేటర్ గందే మాధవి నివాసంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజలతో సమావేశం..
కరీంనగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థి ని ప్రకటించలేదని.. బీజేపీ.. కాంగ్రెస్ మళ్ళీ ఒక్కటవుతున్నాయని అన్నారు. బీజేపీ.. కాంగ్రెస్ లు ఈసారి ఎన్ని కుట్రలు చేసిన కూడా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గా నేను ఘన విజయం సాధిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గందే మాధవి, మహేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి చేసేవాడిని.. ప్రజా సమస్యలపై గళమెత్తే వాడిని నేనే..
ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపాలి..
బండి సంజయ్ ఐదేళ్లలో ఏం చేయలేదు..
బండి సంజయ్ కి ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా..
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై కరీంనగర్ లో మళ్లీ కుమ్మక్కు కాబోతున్నాయి..
ఇది చదవండి : లైంగికదాడి బాధితురాలిని కోర్టు హాలులోనే దుస్తులు విప్పమన్న మేజిస్ట్రేట్..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి