ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోంది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ (Family star) సినిమా. తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ను కలిసేందుకు ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు వస్తోంది. మీ ఇంటి ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు గొప్ప అవకాశం ఇది.
ఇది చదవండి: కేరళలో తెరకెక్కిన ‘నరుడి బ్రతుకు నటన’.. ఆకట్టుకునే ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల
ఈ అనౌన్స్ మెంట్ లోని ఫామ్ ఫిల్ చేస్తే ఫ్యామిలీ స్టార్ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు పరశురామ్ పెట్ల మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారు. ఈ ఫామ్ లో మీ పేరు అడ్రస్ తో పాటు మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ రాసి ఫిల్ చేయాలి. నిన్న థియేటర్స్ లోకి వరల్డ్ వైడ్ రిలీజ్ కు వచ్చింది ఫ్యామిలీ స్టార్ సినిమా. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు సహా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెటెడ్ ఆడియెన్స్ అయిన సకుటుంబ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతోంది.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి