కరీంనగర్ జిల్లా | Karimnagar,
ఎమ్మెల్సీ పదవి కంటే కూడా నాకున్న అతిపెద్ద బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గా ఉంది. అని వెంకట్ బల్మూర్ అన్నారు, NSUI ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లిమెంట్ సన్నాహక సమావేశం కరీంనగర్ డీసీసీ కార్యాలయం లో జరిగింది. ఈ సమావేశానికి NSUI రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, NSUI రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షుడు, NSUI పార్లిమెంట్, అసెంబ్లీ ఇన్ ఛార్జ్ లు, జిల్లా నాయకులు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ …ఎమ్మెల్సీ(MLC Balmoor Venkat) మాట్లాడుతూ…
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో NSUI పాత్ర ఉందని సీఎం, డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ఎమ్మెల్యే లు చెప్పారు. అందుకే మీ అందరి పక్షాన నన్ను మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాడనికి మీ ప్రతినిధిగా MLC ఇచ్చారు. మరోసారి ఎన్ఎస్ యూఐ నాయకులు సిద్ధం కావాలి. ఎలాగైతే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని పని చేశామో..అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పని చేయాలి. ఎమ్మెల్సీ పదవి కంటే కూడా నాకున్న అతిపెద్ద బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గా ఉంది. రాష్ట్రం పార్టీ ఇచ్చిన గ్యారెంటిలని అమలు చేసింది. కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వర్షాలు పడ్డప్పుడు బండి పోతే బండి ఇస్తామన్నారు. ఇప్పుడు మనం కరీంనగర్ లో బండి ని మాయం చేయాల్సిన సమయం వచ్చింది. బండి ని మాయం చేయకపోతే కరీంనగర్ అభివృద్ధి జరుగదు,యువకులకు ఉద్యోగాలు రావు. బండి సంజయ్ కి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అభ్యర్థిని భారీ మెజారిటీ తో గెలిపించాలి. బీజేపీ నాయకులు మతం పేరు మీద రాజకీయం చేస్తున్నారు. ఒక కార్యకర్తగా మనం బీజేపీ గురించి చెప్పాలి. అరేయ్ మేము కూడా హిందువులమే మేము ఉదయం లేవగానే దేవుడిని మొక్కుతాము. కానీ ఏ దేవుడిని ఎప్పుడు మొక్కలి అని మేము నిర్ణయించుకుంటాము అది మా స్వేచ్ఛ. బీజేపీ నాయకుల మాదిరి ఈ దేవుడికే మొక్కలి,ఇది తినాలి అనేవాళ్ళము కాదు. మేము పేద ప్రజల అవసరాలు చూస్తూ దేవుడి పై నమ్మకం కలిపిస్తాము. కానీ బీజేపీ కేవలం దేవుడి పైనే రాజకీయాలు చేస్తుంది తప్ప ప్రజలకు అవసరమున్న విషయాలు పట్టించుకోదు.
కరోన సమయంలో మెడిసిన్ కనిపెట్టండి అంటే గారిటే తో పల్లం పై కొట్టాలని మోడీ అన్నారు…అందరూ కొట్టారు. అలా ఊరికే చేయలేదు మోడీ నేను చెప్తే ప్రజలు ఎలా వింటారో టెస్ట్ చేసుకున్నాడు. ఎలాగైతే నార్త్ కొరియా కిమ్ జాన్ తను ఎలా హెయిర్ స్టైల్ చేసుకుంటే అలాగే చేయించుకోవాలని ,ఏం తింటే అది తినాలి అనే నియంతృత్వ పాలన చేశారో. మోడీ ఇక్కడ కూడా ప్రజలను అలాగే చేయాలని అలాగే పరిపాలించాలని అనుకుంటున్నారు. మనం అలా కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధాని గా చేయాలి. బండి సంజయ్ ని అడగండి కరీంనగర్ కోసం ఏం చేశారని. ఇల్లంతకుంటా సీతారమచంద్ర స్వామి దేవాలయానికి, కొండగట్టు అంజన ఆలయానికి, వేములవాడ రాజన్న గుడికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి. ఊరికే మతం పై యువకులను, ప్రజలను రెచ్చగొట్టడం మానేయండి. కరీంనగర్ ప్రజలు ఈసారి బండి సంజయ్ కి బుద్ధి చెప్పాలి అని బల్మూర్ వెంకట్ …ఎమ్మెల్సీ అన్నారు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి