విశాఖ జిల్లా(Visakha District) అధాని గంగవరం పోర్టు(Gangavaram Port) వద్ద ఓ చిన్నారి ఆవేదన అందరిని కలిచివేసింది. మా నాన్న గంటి పళ్లి అప్పారావు, విధులు నిర్వహిస్తుండగా గంగవరం పోర్టు లో చనిపోయారని, గంగవరం పోర్టు యాజమాన్యం మా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి ఇప్పడు మా వైపు కన్నెత్తి చూడటం లేదని ఆ పాప కన్నిటీ పరితం అయ్యిది.
ఇది చదవండి: బాధిత కుటుంబాలకు భువనమ్మ పరామర్శ..
గంగవరం పోర్టులో పని చేసే చనిపోయిన వారి కుటుంబాలు పూట గడవని పరిస్థితిలో ఉన్నారని వారి పరిస్థితి, నా పరిస్థితి చూసే ఈరోజు నేను కూడా నిరసన చేయడానికి వచ్చానని ఆ చిన్నారి తెలిపింది. అంతేకాకా ఈనాటి చిన్నారులే రేపటి పౌరులు అనే విషయం అదాని యాజమాన్యం గుర్తించి ఇప్పటికైనా చనిపోయిన వారి కుటుంబాలకు అన్ని తామై ఉంటాము అని భరోసా కల్పించాలని యాజమాన్యాని ఆ చిన్నారి కోరింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.