Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Telangana తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ..!

తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ..!

by Satya
Sensational letter of Sukhesh Chandrasekhar from Tihar Jail

రూ. 200 కోట్ల మోసం ఆరోపణలపై తీహార్ జైలు(Tihar Jail)లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) మరోసారి సంచలన లేఖ విడుదల చేశారు. సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు అధికారం దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని అన్నారు. మాజీమంత్రి సత్యేంద్ర జైన్ అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారని తెలిపారు.

ఇది చదవండి: అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్…

జైలు అధికారి ధనుంజయ రావత్ ద్వారా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని సుకేశ్ లేఖలో వెల్లడించారు. మూడు రోజుల నుంచి జైల్ శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారుల ద్వారా తనను బెదిరిస్తున్నారని చెప్పారు. స్టేట్మెంట్ ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఎవరు బెదరించినా తాను వెనక్కు తగేది లేదని సుకేశ్ స్పష్టం చేశారు. మొత్తం నేతల బండారం బయట పెడతానని వెల్లడించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: