Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra PradeshChittoor తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలి

తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలి

by Rama
Tirupati

తిరుపతిలో ఇరుపార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించిన జనసేన అధ్యక్షులు ధార్మిక క్షేత్రమైన తిరుపతి నగరాన్ని కాపాడుకోవాలి అంటే వైసీపీని ఓడించి, ఇంటికి పంపించేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పని చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు సమన్వయంతో అడుగులు వేయాలని జనసేన ఆధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు బూత్ స్థాయి నుంచి ఒకే మాటగా, వ్యూహాత్మకంగా ఎలక్షనీరింగ్ చేయాలన్నారు. వైసీపీ ఓటమితోనే తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఊపిరి తీసుకోగలరని తెలిపారు. శుక్రవారం రాత్రి తిరుపతికి విచ్చేసిన పవన్ కల్యాణ్ గారు తెలుగుదేశం, జనసేన నాయకులతో వేర్వేరుగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఇరుపార్టీలు అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు తిరుపతి వచ్చారు. అనుసరిచాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. తొలుత తెలుగుదేశం పార్టీ నాయకులతో చర్చించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి గారు పోటీ చేసిన సమయంలో అప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి చేసినా దౌర్జన్యాన్ని ఎవరూ మరచిపోలేదు. అదే వ్యక్తి గత అయిదేళ్లుగా తిరుపతిలో, తిరుమల కొండపై ఏ స్థాయిలో తన నైజాన్ని చూపిస్తున్నాడో… ఈ నియోజకవర్గ ప్రజలు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో కూడా చూస్తున్నాము. ఇప్పుడు అతని వారసుడు,వైసీపీ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలకు, గూండా గిరీని అడ్డుకోవలసిన సమయం వచ్చింది. ఇది మన అందరి సమష్టి బాధ్యత.ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తున్నాము. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటులో ఎన్నో చర్చలు చేశాము.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తిరుపతి విషయంలో ఎన్నో సూచనలు చేశారు. 2019 ఎన్నికల్లో దాదాపు గెలిచేసిన సుగుణమ్మ విషయంలో వైసీపీ అనుసరించిన కుయుక్తులు కూడా ఎవరం మరచిపోలేదు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయానికి వచ్చాము. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అనుభవాన్ని… మా పార్టీకి నాయకులు, కార్యకర్తల బలాన్నీ ఉత్సాహాన్నీ జోడించడం చాలా అవసరం. ఇందుకోసం తెలుగుదేశం నాయకులు అన్ని విధాలా ప్రతి దశలో అండగా ఉండాలని కోరుకొంటున్నాను అన్నారు. అంతా ఒకే లక్ష్యంతో పని చేయాలి అని తెలిపారు.

తరువాత జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే ప్రధాన అజెండాగా కూటమి పని చేస్తుంది. ఇందుకోసం త్యాగాలు చేశాము. ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు రక్షించుకోలేకపోతే నాయకులుగా మనం ప్రజలకు అన్యాయం చేసినవాళ్లం అవుతాము. జనసేన, తెలుగు దేశం కార్యకర్తలు ఒకే లక్ష్యంగా పని చేసి వైసీపీని సాగనంపాలి. తిరుపతి నగరంలో వైసీపీ ముఠాలు ఎన్ని రకాల దౌర్జన్యాలకు దిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. చిన్నపాటి వ్యాపారులను, అంగల్లు పెట్టుకొని బతికేవాళ్లను వేధించి వేధించి వదిలారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకు జీ హుజూర్ అనాలి అనే పెత్తందారీ పోకడలు చూపిస్తున్నారు. ఈ దశలో జనసేన బాధ్యత తీసుకొని ముందడుగు వేసింది. తెలుగుదేశానికి ఉన్న సంస్థాగత నిర్మాణ బలాన్ని ఉపయోగించుకొని మనకు ఉన్న జనాదరణను జోడించి ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకుందాము అన్నారు.

ఇది చదవండి: మాచర్ల లో టీడీపీ నేతలపై కొనసాగుతున్న దాడులు..

ఇరు పార్టీల నాయకులకు పవన్ కల్యాణ్ గారు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది అని తెలిపారు. పార్టీ కోసం తొలి నుంచీ బాధ్యతగా వ్యవహరించిన ప్రతి నాయకుడికీ, కార్యకర్తకీ తగిన గుర్తింపు, ప్రాముఖ్యం ఇస్తామని చెప్పారు.ఈ అంతర్గత సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి వేములపాటి అజయ కుమార్ , కోశాధికారి ఎ.వి.రత్నం పాల్గొన్నారు. తిరుపతి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డా.పి.హరిప్రసాద్, నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు జె.రాజారెడ్డి,తదితరులు హాజరయ్యారు. తెలుగుదేశం నుంచి సుగుణమ్మ, నరసింహ యాదవ్,మోహన్, జె.బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగర ప్రముఖులు… తటస్తులతో భేటీ అయ్యారు.తిరుపతి పర్యటనలో భాగం తిరుపతి నగరానికి చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వైద్యులు, తటస్తులతో సమావేశమయ్యారు. 2022లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ప్రకటన ఏ ఉద్దేశంతో చేసిందీ చెబుతూ కూటమి ఏర్పాటు, కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని ఏ విధంగా రక్షించుకుంటాము అనేది తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: