Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra PradeshGuntur మాచర్ల లో టీడీపీ నేతలపై కొనసాగుతున్న దాడులు..

మాచర్ల లో టీడీపీ నేతలపై కొనసాగుతున్న దాడులు..

by Rama
TDP Leaders

Follow us on : FacebookInstagramYouTube & Google News

పల్నాడు జిల్లా మాచర్ల లో టీడీపీ నేతల (TDP Leaders) పై దాడులు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ ను సైతం లెక్క చేయని వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్నారు. రెంటచింతల మండలం తుమ్రుకోట గ్రామంలో ఇటీవల మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) ఎన్నికల ప్రచారం చేశారు.

ఇది చదవండి: వైసీపీ పార్టీకి భారీ షాక్..!

ఈ ప్రచారానికి ప్రజలు వందలాదిగా తరలిరావడంతో, వైసీపీ నాయకులకు కంటిమీద కునుకులేకుండా చేసిందని జూలకంటి బ్రహ్మారెడ్డికి అత్యంత ఆప్తుడైన జలీల్ ఖాన్ బ్రహ్మారెడ్డి పర్యటన గ్రామంలో విజయవంతం చేశాడని వైసిపి నాయకులు ఓర్చుకోలేక అతడిపై దాడులకు తెగబడ్డారని వైసీపీ నాయకులు షేక్ రషీద్, షేక్ గోరె బుడే కుతుబుద్ధిన్, ఏపీ జెన్కో కానిస్టేబుల్ షేక్ సైదా, వాలంటీర్లు షేక్ గౌరీ లు శుక్రవారం మసీదు సెంటర్ లో దారి కాచి జలీల్ ఖాన్ పై రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారని, దాడిలో పటాన్ జలీల్ ఖాన్ కి తలకి తీవ్ర గాయాలు కాగా మరొక వ్యక్తి షేక్ చాంద్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇరువురిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: