ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై ఏస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర లో భాగంగా అరకులోయ పట్టణం చేరుకున్నారు. అరకులోయ ప్రధాన కూడలి వద్ద వై ఎస్ షర్మిల మాట్లాడుతూ ఈ ఐదు ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం ఇక్కడ ఎమ్మల్యే కానీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కానీ ప్రజలకు ఎం చేశారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు వేగంగా దూసుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం 20 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తెస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ప్రత్యేక డీఎస్సీ అన్నారు. మూడు రాజదానులు అన్నారు, రెండున్నర లక్షల ఉద్యోగుల భర్తీ అన్నారు, పూర్తి మద్యపానం నిషేధం అన్న జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వం పూర్తిగా మద్యం అమ్మకాలు జరుపుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దేశంలో ఎక్కడా లేని మద్యం పాలసి భూమ్ బూమ్ బీర్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటి పేర్లు ఎక్కడైనా ఉన్నాయా ఇదా వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు వీళ్ల వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చేది అని షర్మిల అన్నారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఒక్క సారి ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున అరకు నియోజక వర్గం అసెంబ్లీ అభ్యర్థిగా శెట్టి గంగాధర్ స్వామి ని ప్రకటించారు. ఎంపీ అభ్యర్థిగా సిపిఎం పార్టీ నుండి అప్పలనరసయ్యను ప్రకటించటం జరిగింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…