PM Modi Road Show :
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధుల కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగడంతో మూడు పార్టీల శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. బుధవారం విజయవాడలో మోదీ రోడ్ షోకి ప్రజలు సైతం బ్రహ్మరథం పట్టారు. జనం నుంచి వచ్చిన స్పందన చూసి ప్రధాని వైసీపీపై ట్వీట్ చేశారు.
బుధవారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra babu), జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) లతో కలిసి ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీకి చెందిన ఇద్దరు అగ్రనేతల మధ్య దేశానికే బలమైన నాయకుడిగా పేరు సంపాదించుకున్న మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడకు వచ్చిన మోదీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. విజయవాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పొత్తు గెలివాలి..జగన్ రెడ్డి పోవాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
దారి పొడవున మోదీ, చంద్రబాబు(Chandra Babu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) త్రయాన్ని చూడటానికి జనం బారులుతీరాలు. కాషాయ, పసుపు జెండాలు పట్టుకొని కూటమి గెలవాలంటూ నినాదాలు చేశారు. బెజవాడ రోడో షో(PM Modi Road Show)కి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు.
ఈసందర్భంగా నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో తాను పాల్గొన్న రోడ్ షో మరపురానిదని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తాను ఏపీలో పర్యటిస్తున్నానని ..ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్ధులకు ఓట్లు వేస్తారనే విషయం అర్దమైందన్నారు.
ఇక బీజేపీ, టీడీపీ గతంలోనూ కలిసి పనిచేశాయని, భవిష్యత్ అభివృద్ధి దిశగా తమది బలమైన బంధం అని స్పష్టం చేశారు. ఎంతో క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ వల్ల తమ కూటమి మరింత బలోపేతం అయిందని వివరించారు. తమ ఆకాంక్షలు నెరవేర్చే సత్తా ఈ కూటమికి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని మోదీ తన ట్వీట్ లో వెల్లడించారు.
యువత, మహిళల మద్దతు ఎన్డీఏ కూటమికే ఉందని అభిప్రాయపడ్డారు మోదీ. వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. జూన్ 4 వైసీపీకి చివరి రోజని మోదీ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందన్నారు. ఏపీలో అవినీతి, కుటిలత్వం, మాఫియా తత్వాన్ని పెంచి పోషించిందని మోదీ ధ్వజమెత్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రధాని మోదీ రోడ్ షో సక్సెస్ కావడం, ఆయన ట్వీట్ పై స్పందించారు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు. నిజంగా ఇది మరపురాని రోడ్ షో అంటూ తమ అనుభూతిని షేర్ చేసుకున్నారు. ఏపీకి భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మీరు, నేను, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్న రోడ్ షోతో మా ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో కొత్త ఆశాదీపం వెలిగించినట్టయింది అని చంద్రబాబు వివరించారు.
పవన్ కల్యాణ్ కూడా రోడ్ షోపై ట్వీట్ చేశారు. మోదీ గారు మీరు ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. మీరు సంకల్పించిన వికసిత భారత్ కార్యాచరణ కోసం మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని పోస్ట్ పెట్టారు.
ఏపీలో మూడు పార్టీలు జత కట్టినప్పటికి ఇప్పటి వరకు మూడు పార్టీలకు చెందిన అగ్రనాయకులు ఈవిధంగా ఒకే ప్రచారంలో పాల్గొనకపోవడంతో ప్రజల్లో ఈ కూటమిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే బుధవారం రోడ్ షోతో అందరికి క్లారిటీ వచ్చింది.
మరోవైపు వైసీపీకి జూన్4 చివరి రోజని ప్రధాని చేసిన ట్వీట్ పై అధికార పార్టీలో గుబులు మొదలైనట్లుగా తెలుస్తోంది. ప్రజలు వైసీపీ పాలనపై విసుగు చెందారని ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని చెప్పడంపై వైసీపీ నేతలు సైతం అయోమయంలో పడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోని సూపర్ సక్సెస్ చేసిన ఓఠర్లు తమ అభిమానాన్ని, అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడతారో లేదో చూడాలి. అయితే అటు వైసీపీ కూడా సింగిల్ గా ప్రచారం చేస్తూనే గెలుపుపై స్పష్టమైన క్లారిటీ మెయిన్ టెన్ చేస్తోంది.
పవన్ సినీ గ్లామర్, మోదీ చరిష్మతో పాటు చంద్రబాబు పరిపాలన అనుభవాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటే ఎన్డీఏ కూటిమి అభ్యర్ధులు అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.