తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజదొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు ఉంది అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుందని టీడీపీ చేసిన ఆరోపణలు ముమ్మాటికి అబద్దం అన్నారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో కనీస అవగాహన లేకుండా మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్‌లో 241 కోట్ల రూపాయలు దోచుకుందెవరు? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? అని బుగ్గన నిలదీశారు. ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? సామాన్య ప్రజలలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ప్రజలకు స్పష్టమవుతుంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
గజదొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు…
66
previous post