పల్లా రాజేశ్వర్‌రెడ్డి పై కేసు నమోదు..!

Palla Rajeshwar

Advertisements

&NewLine;<p>జనగామ ఎమ్మెల్యే&comma; భారాస సీనియర్‌ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కేసు నమోదైంది&period; పోచారం ఐటీ కారిడార్‌ ఠాణాలో ఆయనతోపాటు భార్య నీలిమ&comma; మధుకర్‌రెడ్డిలపై మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలోని బుద్ధనగర్‌కు చెందిన ముచ్చర్ల రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు&period; అందులోని వివరాల మేరకు ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడలో ఎంఏ రషీద్‌&comma; ఎంఏ ఖాదర్‌ పేరిట సర్వే నంబరు 796లో ఉన్న భూమిలో 1984-85 ప్రాంతంలో వెంచర్‌ వేశారు&period; లేఅవుట్‌లోని 167 ఓపెన్‌ప్లాట్లను పలువురు కొనుగోలు చేశారు&period; 2020లో సదరు లేఅవుట్‌లోని 150 చదరపు గజాల ప్లాటును ఉటుకూరు మల్లేశం అనే వ్యక్తి నుంచి ముచ్చర్ల రాధిక కొనుగోలు చేశారు&period; కొంతకాలం క్రితం ఈ స్థలంలోకి గాయత్రి ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి&comma; నీలిమ&comma; మధుకర్‌రెడ్డిలు దౌర్జన్యంగా ప్రవేశించి స్తంభాలు తొలగించడంతోపాటు నిర్మాణం కోసం తవ్విన గుంతల్ని పూడ్చేశారు&period; తప్పుడు పత్రాలు సృష్టించడంతోపాటు మండల రెవెన్యూ కార్యాలయంలోని లేఅవుట్‌లో వివరాలను మార్చారని&comma; తమ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు&period; ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Prjo&lowbar;zc-&lowbar;rI" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.