అల్లూరి జిల్లా పాడేరులో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది. చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏం ఉందో కనిపించడం లేదు. దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. చలి పులి పంజా విసరడంతో విశాఖ ఏజెన్సీ వణికిపోతోంది. పాడేరులో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. మిచౌంగ్ తుఫాన్ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది. తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపించకపోగా, మంచు దుప్పటి కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. పాడేరులో పగలైనా సరే, వాహనం బయటకు తియ్యాలంటే లైట్లు ఆన్ చెయ్యాల్సిందే. ఇక ముంచంగిపుట్టులో చలి తీవ్రతకు జనం చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. క్రమంగా ఉష్ణోగ్రతలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతోంది. దీంతో కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ముంచంగిపుట్టు, హుకుంపేట, పెదబయులు, జి మడుగుల మండలాల పరిధిలో గత మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం పూట పది గంటల వరకు హుకుంపేట లో మంచు తెరలు వీడడం లేదు. చలికి జనం గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత వీధుల్లో చలి మంటలు దర్శనమిస్తున్నాయి.
పంజా విసురుతున్న చలి పులి….
66
previous post