మంగలహాట్ పోలీసుస్టేషన్ పరిధిలోని దారుసాలం లో పురాతన పోలీసుస్టేషన్ భవనంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మంగలహాట్ పోలీసులు. పోలీసులు, ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ అఫిస్ స్టాఫ్ మంటలార్పుతుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో ఒక్కసారి భవనం కుప్పకూలింది. అక్కడే మంటలార్పుతున్న మంగలహాట్ పోలీసుస్టేషన్ హోమ్ గార్డు కు, ఎలక్ట్రిక్ ఉద్యోగి కి తీవ్ర గాయాలు కావడంతోవారిని మంగలహాట్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన హోంగార్డు రాజు, ఎలక్ట్రిక్ ఉద్యోగి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారని పోలీసులు తెలిపారు. పాత భవనం కావడంతో అక్కడే వ్యాపారం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి సిలిండర్ పెట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ ఆఫీస్ నుండి షార్ట్ సర్క్యూట్ తో నైనా, ఎవరైనా మంట పెట్టడం వల్లనైనా ప్రమాదం జరిగిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంగలహాట్ పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి మంగలహాట్ పోలీసుస్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం…
96
previous post