రాష్ట్ర ప్రభుత్వాన్ని గత పది రోజుల నుంచి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చంద్రగిరి ప్రభుత్వ బాలికల కళాశాల నుండి వెళ్లి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అనంతరం రోడ్డుకి ఇరువైపులా కూర్చొని భోజనం తింటూ నిరసన వ్యక్తం చేసారు. అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయి లక్ష్మి మద్దతు ప్రకటించారు. అప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు గండికోట చిన్నబాబు అలాగే ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్బంగా సి.ఐ.టి.యు జిల్లా నాయకులు జయచంద్ర, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మోసపూరితమైన వైఖరి అవలంబిస్తుంది ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా దాటేసే పద్ధతిలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. గతంలోనే సమస్యలు పరిష్కారం చేసినవి నేడు చేశామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని గ్రాజివిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఈ సమ్మె ఈ సమస్యల పరిష్కారం అయ్యేవరకు కొనసాగుతాదని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రియదర్శిని, నాగరాజమ్మ, పద్మిని, లీల, నాగభూషణమ్మ, విజయ్ కుమారి తదితరులు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు.
చంద్రగిరి లో భారీ రాస్తారోకో….
67
previous post