ఏపీపీఎస్సీ(APPSC)లో రూ. 150 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ జాతీయ కోశాధికారి, జగ్గయ్యపేట(Jaggayyapet) నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ఆరోపించారు. సంతలో పశువుల్ని అమ్ముకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ(APPSC) ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు. జగ్గయ్యపేట(Jaggayyapet)లో ఆయన మాట్లాడుతూ గ్రూపు-1 మెయిన్స్ లో జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వ అక్రమాలు హైకోర్టులో బహిర్గతమయ్యాయన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ. 2.50 కోట్లకు, ఒక్కో డిఎస్పీ పోస్టు రూ. 1.50 కోట్లకు అమ్ముకున్నారన్నారు. ఎపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు, కుట్రలకు నిరుద్యోగ యువత బలైందన్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మునుపెన్నడూ లేని వివాదాలు జగన్ సర్కార్ లో ఎందుకు తలెత్తాయని..వాటికి కారణాలు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ రాజగోపాల్ తాతయ్య డిమాండ్ చేశారు.
ఇది చదవండి: దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, మహనీయులకు నివాళులు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి