ఫార్ములా – ఈ రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ కు మెమో జారీ చేసింది. కార్ రేసింగ్ కు సంబంధించి ఫార్ములా – ఈ తో కుదుర్చుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలని కోరింది. కంపెనీతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని కోరింది. అదే విధంగా, కేబినెట్ ఆమోదం లేకుండానే రూ.54 కోట్లు నిధుల విడుదలను గురించి ఇందులో ప్రశ్నించింది. బీహార్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గత ప్రభుత్వంలో మున్సిపల్, హెచ్ఎండీఏ కమిషనర్ గా పనిచేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా పేరుపొందారు. తాజాగా ఆయనకు ప్రభుత్వం మెమో జారీ చేయడం సంచలనంగా మారింది. కాగా, ఫార్ములా రేస్ రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు నోటీసులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని ప్రశ్నిస్తూ ఫార్ములా – ఈ కంపెనీ హెచ్చరించింది. మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు పంపుతామని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించింది. దీంతో ఫార్ములా – ఈ కంపెనీతో కుదరిన ఒప్పందం, నిధుల విడుదలతో సహా పలు అక్రమాల వివరాలు బయటపడ్డాయి.
సంచలనంగా మారిన ఫార్ములా – ఈ రేసింగ్ వ్యవహారం
74
previous post