పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం పేరు చెబితే తెలియని వారంటూ ఎవరు ఉండరు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న బీచ్ పర్యాటక ప్రాంతంగా అందరికీ పరిచయమే ఈ ప్రాంతంలో లభించే తేగలు ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించెలా ఉంటాయి. అయితే తేగలు తినాలి అంటే వాటి కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. తాటి చెట్టు నుండి లభించే తాటి పండ్ల ను ఒక స్థలంలో కుప్పగా వేసి దాదాపుగా 3 నెలల కాలం ఉంచితే వాటి నుండి వచ్చే మొలకలేనే తేగలు అంటారు. వాటిని తీసి, కాల్చడం పెద్ద ప్రొసస్ అనే చెప్పాలి. ప్రతి ఏటా సుబ్రహ్మణ్యేశ్వర షష్టికి ముందు వచ్చే నాగుల చవితి పండుగ రోజునే పాత్రగా వేసిన తేగలను పాత్రనుండి తీసి వేరుచేసి తేగల నుండి బుర్రలను వేరు చేసి ఒక కుండలో పెట్టీ తేగలను తంపడ వేస్తారు. మట్టి కుండలో వేసి తంపడ వేసిన తేగలు చాలా మధురంగా ఉంటాయి. అందులోనూ పేరుపాలెం తీర ప్రాంతాల్లోని తేగలు మంచి రుచి కలిగి ఉండటంతో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి ప్రదేశాలకే కాకుండా కువైట్, దుబాయ్ వంటి ఇతర దేశాలలో వుండే బంధువులు, స్నేహితులకు ఈ ప్రాంతాల నుండి పంపుతూ ఉంటారు. అయితే దీనిపై ఆధారపడి నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది జీవనం సాగిస్తున్నారు. ఎంతో శ్రమిస్తున్న కనీసం కూలీ పని డబ్బులు కూడా రావడం లేదని తేగలు, డొక్కలు కొనుగోలుకు ఖర్చు పెట్టే డబ్బులు కూడా రావడం లేదని ప్రభుత్వం తమను ఆదుకొని సహకారం అందించాలని ఆ వృత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు కోరుతున్నారు. కుటీర పరిశ్రమలకు చేయూత అందిస్తున్నట్లు గా తమకు కూడా ప్రభుత్వాలు బ్యాంక్ లోన్ లు మంజూరు చేస్తే బాగుంటుందని ఈ చిరు వ్యాపారులు అంటున్నారు.
తేగలు పై ప్రత్యేక కథ….
148