ప్రకాశం జిల్లా ముండ్లమూరు ఎమ్మార్వో కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన సత్యవాణి, మన్మోహన్ అను వారు ఇటీవల పోలవరం గ్రామం లో 738/1 సర్వే నెం లో 88 సెంట్లు ఎర్రచందనం మొక్కలు ఉన్న పొలంను కొనుగోలు చేయగా ఆ పొలం ను కన్వర్షన్ చేయమని విఆర్వో రవిశంకర్ ను కోరారు. విఆర్వో 40 వేలు లంచం డిమాండ్ చేయగా వారు అంత డబ్బులు ఇవ్వలేం అని తెలపటంతో విఆర్వో రవిశంకర్ 35 వేలు ఇస్తేనే చేస్తా లేకుంటే లేదని అనడంతో వారికి ఏం చెయ్యాలో తెలియక ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డిఎస్పీ వల్లూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతుల వేషం లో ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ సిబ్బంది 35 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నమని ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు తెలిపారు. విఆర్వో ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తామని తెలిపారు.
ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు…
63
previous post